
ఇప్పుదిక్కడంతా చీకటి పరచుకుమ్తోమ్ది
అంత భయ విహ్వలులై
ఒరుసుకుంటూ, రాసుకుకుమ్టు, రాపాడుకుంటు
రొప్పుతూ, నెత్తురోడుతూ పరుగులేతున్నారు!
భయానక కాలమేఘం
వేగంగా కమ్ముకుంటున్న దృశ్యం
కరాల నాలుకపై రంగురంగుల
రక్తంతో నగ్న దృశ్యాలను పులుముకుంటూ
తనలోకాహ్వానిస్తుంది!
స్వేచా వాయువులను బంధిస్తూ
పావురాల రెక్కలను కరకర విరిచేస్తుంది
తారుపుసిన రోడ్లపై జారజరా
పాక్కుంటూ అనకొందలా నోరుతెరుస్తూ....
ఇటుచివర బక్కపలుచని
జన్తోకటి సన్నని మెరుపుతీగలా
విల్లంబులను సవరించుకుంటూ
వెంనేలగాననాన్ని ఆలపిస్తూ
ఎదురొస్తుంది...