ఊళ్ళను ఖాళీ చేయడం గురించి వాదికే౦ తెలుసు
తరతరాలుగా పురిటినొప్పులు పది౦దిక్కదే
ఈ మట్టిని పూసుకొని ఈ రాళ్ళతో
గూల్లుకట్టుకొని అడుకు౦దిక్కడే
ఈ నేలను పూసిన పువ్వులనే
ప్రేయసికి కానుకగా ఇచ్చాను
ఈ మట్టి పరిమ౦ మా చెమటలో
యి౦కి నెత్తురుగా ప్రవహిస్తో౦ది
ఊళ్ళను ఖాళీ చెయద౦ గురి)ఛి వాదికే౦ తెలుసు
లుకేమియా పేశె౦టులా కొత్త రక్త౦
ఎక్కి౦చుకొని అమ్మ చనుబాలను
ఖాళీ చెయద౦లా వు౦దిమాకు
ఇక్కడి చెట్టూ చేమా, పురుగూ, పుత్రా
తుప్పా డ౦కా అ౦తా మా బ౦ధువులే
ఇక్కడి పక్షు కిలకిలా రావాలు
ఈ ఏటి నీళ్ళలో కేరి౦తలాదిన క్షణాలు
జ్ఞాపకాలుగా గోడలలో మేకులు
వేయమ౦టున్నడు వాడు
ఊళ్ళను ఖాళీ చేయడం గురి౦చి వాదికే౦ తెలుసు
నా ఊరినీ, నేలనీ కోల్పోయి
స్వదేశ)లో కా౦దిశేకునిలా
కావిడి భుజానేసుకొని
ఎక్కడికో పోయి బతకడ౦
మా జీవితాల్నీ, జ్ఞాపకాల్నీ
ఆశల్నీ, అత్మీయతల్నీ,
వెలకట్టి నిర్నయి౦చే౦దుకు వాడేవాడు
ఈ మట్టిలో కలవనైనా కలుద్దా౦
కడదాకా కలబదుదా౦
(ఈ మట్టి నిర్వాసితులకు స౦ఘీభావ౦గా)
20090101
20081231
వెన్నెల గానం

ఇప్పుదిక్కడంతా చీకటి పరచుకుమ్తోమ్ది
అంత భయ విహ్వలులై
ఒరుసుకుంటూ, రాసుకుకుమ్టు, రాపాడుకుంటు
రొప్పుతూ, నెత్తురోడుతూ పరుగులేతున్నారు!
భయానక కాలమేఘం
వేగంగా కమ్ముకుంటున్న దృశ్యం
కరాల నాలుకపై రంగురంగుల
రక్తంతో నగ్న దృశ్యాలను పులుముకుంటూ
తనలోకాహ్వానిస్తుంది!
స్వేచా వాయువులను బంధిస్తూ
పావురాల రెక్కలను కరకర విరిచేస్తుంది
తారుపుసిన రోడ్లపై జారజరా
పాక్కుంటూ అనకొందలా నోరుతెరుస్తూ....
ఇటుచివర బక్కపలుచని
జన్తోకటి సన్నని మెరుపుతీగలా
విల్లంబులను సవరించుకుంటూ
వెంనేలగాననాన్ని ఆలపిస్తూ
ఎదురొస్తుంది...
20081120
నాకు ఇష్టమైన వాక్యం
" నేను మట్టిగావడం కంటే బూడిదగావదానికె ఇష్టపడతాను. కుళ్ళి కృశించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను. మందకొడిగా, ఒక శాశ్వత గ్రహంగా వుండటంకంటే దేదిప్యమనంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను. మనిషన్నవాడు జీవించాలి, బతుకీడ్చడం కాదు. - జాక్ లండన్.
20081109
నా గురించి
మితృలందరికీ నమస్కారంలు,
నేను సాహిత్య రంగంలో కొంతమేర పరిచయం వున్నవాడిని. నా కవితా సంకలనం వెంనేలదారి పేరునే నా బ్లాగ్ టైటిల్ గా పెట్టుకున్న. నాకు కవితలన్నా, వ్యాసాలన్న ప్రాణం. నా కవితలన్నీ ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికి పరిచయం చేస్తూ మీ అందరి సలహాలు, విమర్శలతో నా రచన వ్యాసాన్గాన్ని పరిపుష్టం సెసుకొందామన్న ఆశతో బ్లాగ్లోకంలో ప్రవేశిస్తున్న, మీ అందరి ఆశీస్సులు కోరుతూ.
నర్మద
నేను సాహిత్య రంగంలో కొంతమేర పరిచయం వున్నవాడిని. నా కవితా సంకలనం వెంనేలదారి పేరునే నా బ్లాగ్ టైటిల్ గా పెట్టుకున్న. నాకు కవితలన్నా, వ్యాసాలన్న ప్రాణం. నా కవితలన్నీ ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికి పరిచయం చేస్తూ మీ అందరి సలహాలు, విమర్శలతో నా రచన వ్యాసాన్గాన్ని పరిపుష్టం సెసుకొందామన్న ఆశతో బ్లాగ్లోకంలో ప్రవేశిస్తున్న, మీ అందరి ఆశీస్సులు కోరుతూ.
నర్మద
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)